in

naga shourya’s next titled as ‘police vaari hecharika’!

నాగశౌర్య టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకడు. ప్రతి సినిమాలో పక్కింటి అబ్బాయిగా కనిపిస్తూ అలరిస్తుంటాడు. కానీ కొన్ని సినిమాల నుంచి అతడు గేర్ మార్చేశాడు. యాక్షన్ వైపు అడుగులు వేస్తున్న శౌర్యకు చలో సినిమా తర్వాత సరైన హిట్ పడలేదు. దేహ దారుఢ్యాన్ని పెంచి యాక్షన్ సీన్స్‌తో సమాజానికి మెసేజ్ ఇచ్చేవిధంగా చేసిన అశ్వథామ కూడా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మరో మూవీ టైటిల్‌ను ప్రకటించాడు నాగశౌర్య.

“పోలీసు వారి హెచ్చరిక” అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో నాగశౌర్య వస్తున్నాడు. దర్శకుడు హరీష్‌ శంకర్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన కేపీ రాజేంద్ర ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక మహేష్‌ కోనేరు ఈ మూవీని నిర్మిస్తున్నారు. నాగశౌర్య బర్త్‌ డే సందర్భంగా గురువారం ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

shankar to do a multi starrer with yash and ram charan?

ntr cinema script file nu road midha kalchesina director!