నాగచైతన్య-సమంత విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మనం మర్చిపోయినా.. బాలీవుడ్ మీడియా ఎప్పటికప్పుడు వీరిద్దరిపై ఓ కన్నేసే ఉంది. అయితే కొన్నిసార్లు పుకార్లను కూడా సీరియస్‌గా తీసుకుని అవే నిజమని నమ్ముతోంది. తాజాగా ఇలాంటి ఓ ఊహగానాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది బాలీవుడ్ మీడియా. నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వందతి బయటకు వచ్చింది. చై-సామ్ విడిపోయిన తర్వాత.. ఒంటరిగా ఉండటం ఇష్టం లేక.. అక్కినేని హీరో మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్నాడని వార్తలను ప్రచారం చేసింది. దీంతో సదరు నాగచైతన్య టీమ్ స్వయంగా స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది.
అలాంటి రూమర్లలో ఎలాంటి నిజం లేదని, అవి కేవలం ఊహాగానాలే అని ఖండించింది. అంతేకాకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని కోరింది. ఇదిలా ఉంటే నాగచైతన్య-సమంత విడాకులకు సంబంధించి చట్టపరమైన చర్యలు ఇంకా పూర్తి కాలేదు. వీరికి అధికారికంగా ఇంకా విడాకులు రాలేదు. కాబట్టి అంతలోనే మరో వివాహం గురించి మాట్లాడటం సరికాదని నాగచైతన్య సన్నిహితులు స్పష్టం చేశారు. ప్రస్తుతం నాగచైతన్య-సమంత తమ తమ కెరీర్‍లో బిజీ అయిపోయారు. సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. బాలీవుడ్‌లోనూ సినిమా చేసేందుకు పచ్చ జెండా ఊపింది.