in

Samantha Plays Kashmiri Girl In rowdy star’s next?

శ్మీరీ అమ్మాయిగా సమంత.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. ఈ ముద్దుగుమ్మ, తన నెక్ట్స్ మూవీలో కశ్మీరీ అమ్మాయిగా కనిపించబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది సమంత. ఇందులో ఆమె పాత్ర ఇదే అనే టాక్ బలంగా వినిపిస్తోంది..శివ నిర్వాణ దర్శకత్వంలో గతంలో మజిలీ అనే సినిమా చేసింది సమంత. అందులో తన మాజీ భర్త నాగచైతన్యతో కలిసి నటించింది. ఆ సినిమాలో ఆమెది బలమైన పాత్ర.

తాజా చిత్రంలో కూడా అలాంటి బరువైన పాత్రనే పోషిచంబోతోంది సమంత. మరో వారం రోజుల్లో ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దర్శకుడు శివ నిర్వాణ..ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో. శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఇదే తొలి చిత్రం. ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు విజయ్. సినిమాలో విజయ్ కు ప్రేయసిగా, తర్వాత అతడికి భార్యగా డిఫరెంట్ షేడ్స్ లో సమంత కనిపించబోతోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి హోమ్ వర్క్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా టక్ జగదీశ్ అనే సినిమా చేశాడు శివ నిర్వాణ. అందులో కొంచెం మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ చూపించాడు. ఆ సినిమా ఫెయిల్యూర్ తో తిరిగి తనకు ఇష్టమైన రొమాంటిక్ డ్రామాలోకి వచ్చే, ఈ కొత్త కథ రాసుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ సినిమా. కశ్మీర్ లోనే ఫస్ట్ షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది.

Allu Arjun Turns Down Tobacco add Offer For His Fans?

Yamini Bhaskar stills at Titanic Audio Launch!