in

Naga Chaitanya says Samantha’s The Family Man ‘blew his mind’!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ మధ్య బాగా నచ్చిన వెబ్ సిరీస్ ఏదనే ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా ‘ది ఫ్యామిలీ మ్యాన్‘ సిరీస్ అని చెప్పారు. సమంత నటించిన ఈ సిరీస్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఈ సిరీస్ లో ఆమె నటన మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇప్పటికీ సమంత నటించిన అన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తానని చై వెల్లడించారు.

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2‘తో సమంత డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ లో శ్రీలంక ఆర్మీ చేతిలో అన్యాయానికి గురైన తమిళ యువతి రాజీ పాత్రలో సమంత నటించింది. బోల్డ్ పెర్ఫామెన్స్‌ తో షాక్ ఇచ్చింది. ఆమె నటనకు అప్పట్లో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి..తొలి సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డ వీరిద్దరు అక్టోబర్ 2017 లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పలు కారణాలతో అక్టోబర్ 2021లో విడాకులు తీసుకున్నారు..!!

khushboo replaced with actress maheswari for jabardasth!

rashmika compares animal with arjun reddy!