ఈమధ్యనే కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత మీ ఇద్దరి మధ్య ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే మా ఇద్దరినీ కలిపి ఒక గదిలో పెడితే అక్కడ పదునైన వస్తువులు లేకుండా దాచేయాలని లేకపోతే వాటితో పొడుచుకుంటామేమో అని అర్థం వచ్చేలా కామెంట్ చేసింది..ఇక తాజాగా లాల్ సింగ్ చద్దా సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి ప్రశ్ననే ఆయనను కూడా అడిగారు విలేకరులు. ఒకవేళ సమంతను కలిస్తే మీరేం చేస్తారు అని అడిగితే నేను హాయ్ చెప్పి ఒక హగ్ ఇస్తానని నాగచైతన్య చెప్పుకొచ్చారు. ఇక ప్రశ్న దాదాపు ఒకటే అయినా ఇద్దరి స్పందనలు లు చాలా భిన్నంగా ఉండడంతో ..
అక్కినేని అభిమానులు మా చైతన్య బంగారం అంటూ కామెంట్ చేస్తున్నారు..సమంత చాలా దుర్మార్గంగా మాట్లాడితే నాగచైతన్య మాత్రం చాలా గొప్పగా ఆలోచించాడని వారు కామెంట్ చేస్తున్నారు. ఇక గతంలో సమంత గురించి నాగచైతన్య మాట్లాడుతూ మా పర్సనల్ లైఫ్ గురించి చెప్పాల్సింది ఇక అంతే. ఏవైతే విషయాలు నేను మీ ముందు చెప్పాలనుకున్నానో అవి చెప్పేసాను. అది మంచో చెడో నేను చెప్పాలనుకున్నది ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాను. ఇప్పుడు ఆమె పని ఆమె నా పని నేను చేసుకుంటున్నాము. ఇంకా మా గురించి మళ్లీ మళ్లీ అడిగి తెలుసుకోవాల్సిన అంత ముఖ్యమైన విషయాలు ఏమీ లేవని ఆయన వెల్లడించారు..!!