in

NTR Was Not First Choice For ‘Student No1’: Ashwini Dutt

సీతారామం సక్సెస్‌తో నిర్మాతగా మరో జన్మ ఎత్తినట్లుందని తన్మయత్వానికి లోనవుతున్నాడు అశ్వినీదత్‌. వైజయంతి బ్యానర్‌లో ఆయన తీసిన ఎన్నో సినిమాలు మరపురాని విజయాలను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు..’పెళ్లి సందడి సినిమాను హిందీలో తీశాం. తర్వాత నేను, అరవింద్‌గారు కలిసి అనిల్‌ కపూర్‌తో చూడాలని ఉంది మూవీ తీశాం. అప్పుడిద్దరికీ చెరో ఆరు కోట్లు పోయాయి. అప్పట్లో ఓ సినిమాకు వాణిశ్రీని ఫిక్స్‌ చేశాం. ఆమె రూ. 2 లక్షలు కావాలంది. ఆమె అంత అడిగిందంటే ఎన్టీఆర్‌ రెండున్నర అడుగుతారేమోనని యాభైవేలు ఓ పొట్లంలో పట్టుకుని వెళ్లా.

దానికాయన ఇంత డబ్బుందేంటి? మనం తీసుకునేది రెండు లక్షలే అని మిగతాది తిరిగిచ్చేశాడు. మహేశ్‌బాబు- రాజకుమారుడు, రామ్‌చరణ్‌- చిరుత, అల్లు అర్జున్‌- గంగోత్రి. ఇలా ఈ హీరోల మొదటి సినిమాలన్నీ మా బ్యానర్‌లో వచ్చినవే. తారక్‌ది మాత్రం రెండో సినిమా స్టూడెంట్‌ నెంబర్‌ 1 తీశాం. ఈ సినిమాకు మొదట ప్రభాస్‌ను అనుకున్నాం. ఇంతలో హరికృష్ణ ఫోన్‌ చేయడంతో ఆ ప్రాజెక్ట్‌ తారక్‌కు వచ్చింది. ఇక నా జీవితంలో ఆఖరి చిత్రం.. జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్‌ 2. శక్తి సినిమా రిలీజైనప్పుడు చాలా డిసప్పాయింట్‌ అయ్యాను. అప్పుడే నాన్న చనిపోయారు. రజనీకాంత్‌ నా మాట వినలేదు, నా భార్య కూడా చెప్పింది వినలేదు. అప్పుడు నాలో శక్తి నశించిపోయినట్లనిపించింది’ అని చెప్పుకొచ్చాడు అశ్వినీదత్‌.

Macherla Niyojakavargam!

Naga Chaitanya Says He Will Give A ‘Hug’ To Ex-Wife Samantha!