in

MS Dhoni Sends Special Gift To hero nithin!

హీరో నితిన్ రెడ్డి హిట్ చూసి చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో భీష్మతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలు వచ్చినట్టే వెళ్లిపోయాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మాచర్ల నియోజకవర్గం కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం ఈ హీరో ఆశలన్నీ వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రీలీలతో కలిసి నటిస్తున్న సినిమాపైనే ఉన్నాయి.

ఈ సినిమానే ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. అయితే, నితిన్ కొత్త సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వచ్చేనెల 8న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ టీం కి విషెస్ తెలియజేస్తూ కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోని స్పెషల్ గిఫ్ట్ ను పంపించారు. ఈ విషయాన్ని నితిన్ ట్విట్టర్(X)లో వెల్లడించారు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నుంచి ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘బెస్ట్ విషెస్ నితిన్’ అని సంతకం చేసిన టీ షర్టును చూపించగా..ఈ ఫోటో వైరల్ అవుతుంది..!!

animal

rashmika gets no credit for animal success!