in

Rana Daggubati as Ashwatthama in Jai Hanuman?

హ‌నుమాన్’ తో రియ‌ల్ పాన్ ఇండియా హిట్టు కొట్టాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు సీక్వెల్ గా ‘జై హ‌నుమాన్’ రూపొందిస్తున్నాడు. హ‌నుమాన్ తో పోలిస్తే కాస్టింగ్ ప‌రంగా, బ‌డ్జెట్ ప‌రంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. కాంతార తో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్న రిష‌బ్ శెట్టి హ‌నుమంతుడిగా క‌నిపించ‌బోతున్నాడు. రిష‌బ్ రాక‌తో..ఈ సినిమా మ‌రింత బ‌లం పుంజుకొంది. ఇక ‘హ‌నుమాన్’ లో హీరోగా న‌టించిన తేజా స‌జ్జా కూడా ఈ సినిమాలో భాగం పంచుకోబోతున్నాడు. త‌న పాత్ర ఈసారి ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది..

ఈ చిత్రంలో రానా కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రానా ఎంట్రీ అధికారికంగానూ ఫిక్స‌య్యింది. ఇటీవ‌ల రానాపై కొన్ని స‌న్నివేశాలు కూడా చిత్రీక‌రించారు. ఈ సినిమాలో రానా పాత్ర ఏమిట‌న్న విష‌యంలో ఇప్పుడు క్లారిటీ వ‌చ్చింది. ఈ సినిమాలో రానా పురాణాల్లో ప్ర‌సిద్ది చెందిన అశ్వ‌ద్దామ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అశ్వ‌ద్దామ అన‌గానే ఇటీవ‌ల వ‌చ్చిన ‘క‌ల్కి’ గుర్తుకు వ‌స్తుంది. ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ అశ్వ‌ద్దామ పాత్ర‌లో క‌నిపించారు. పార్ట్ 2లోనూ ఆ పాత్ర కొన‌సాగ‌నుంది. ఇప్పుడు అదే పాత్ర రానా చేయ‌బోతున్నాడ‌న్న‌మాట‌..!!

Allu Arjun ask Fans to Stay Away From Social Media Fan Wars!

Rishab Shetty gets the ‘Leadership in Cinema’ Award at IFFM 2026!