in

most desirable women Samantha!

అందాల తార సమంత జీవితంలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019‌గా సమంత అక్కినేని ఎంపికయ్యారు. 40 ఏళ్ల లోపు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా ప్రముఖుల గురించి సర్వే చేయగా సమంత టాప్ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సమంత టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..

పెళ్లి తర్వాత హీరోయిన్లు తమ కెరీర్‌ను నిలబెట్టుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది. చైతూతో పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోవాలనుకొన్నాను. అదే విషయం నా భర్తతో చెబితే చాలా ఆశ్చర్యపోయారు. నీకేమైనా పిచ్చెక్కిందా అనే రేంజ్‌లో నీవు అంటున్నది నిజమేనా అంటూ గుచ్చి గుచ్చి అడిగాడు. ఎందుకంటే పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకొన్న కొందరు హీరోయిన్ల మళ్లీ సినీ రంగాన్ని తిరిగి చూడలేదు. నేను ఏదైనా సాధిస్తున్నానంటే అందుకు కారణం నా భర్త, నా ఫ్యామిలీ అని సమంత అన్నారు.

రోజు రోజుకు అందంగా కనిపించడంపై… నేను లేవగానే చూస్తే ఇలా అందంగా కనిపించను. నేను అందంగా కనిపించడానికి చాలా కసరత్తే జరుగుతుంది. నేను ఇలా గ్లామరస్‌గా కనిపించడం వెనుక 10 మంది టీమ్ పనిచేస్తుంటారు. నేను ఎలా ఉండాలి? ఎలాంటి బట్టలు ధరించాలి? ఎలా మేకప్ వేసుకోవాలి? ఇలాంటి విషయాలను నా జట్టు సభ్యులు పదే పదే గుర్తు చేస్తుంటారు అని సమంత తెలిపారు.

నేను ఎప్పుడు గ్లామర్‌గా, సెక్సీగా కనిపించడానికి ప్రయత్నించను. అందుకే నేను మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా ఎంపికయ్యానని భావిస్తాను. నేను చాలా స్ట్రిక్ట్‌గా ఆహార నియమాలను పాటిస్తాను. ఎందుకంటే మన దేహాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దానికి ఏం అవసరమో అదే తీసుకోవాలి. నేనే చేసే పనిని బట్టి నా దేహాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి అని సమంత అన్నారు.

నా వ్యక్తిత్వం ధృడంగా ఉండటానికి కారణం నేను సమాజం నుంచి చాలా నేర్చుకొంటాను. నిశితంగా ప్రతీ విషయాన్ని పరిశీలిస్తాను. నా చుట్టు ఉన్నవారి వద్ద నుంచి చాలా నేర్చుకొంటాను. ఫ్యాషన్ బుక్స్ చదువుతాను. ఫ్యాషన్ షోలు చాలా చూస్తాను. లేటేస్ట్ ట్రెండ్స్‌కు తగినట్టు నేను అప్‌డేట్ అవుతాను అని సమంత తెలిపారు.

నేను సెక్సీగా ఉంటానో లేదో తెలియదు కానీ. నేను నా భర్త చైతన్యతో డేటింగ్‌కు వెళ్లినప్పుడు చాలా సెక్సీగా ఉంటాను. ఆయన నా పక్కన ఉంటే చాలా అందంగా కనిపిస్తాను. ఓ డిజైరబుల్ ఉమెన్‌గా కనిపిస్తాను. 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా నేను అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే. ఎప్పుడు హ్యాపీగా ఉండటం వల్ల మనలో అందం రెట్టింపు అవుతుంది అని సమంత అన్నారు.

rashmi gautham fires on airport security!

charmi about his director jayanth!