in

BALAYYA FANS MISSED A GOLDEN CHANCE!

మిళ సూపర్ స్టార్ రజని కాంత్ నటించిన బాషా చిత్రం ఎంత సూపర్ డూపర్ హిట్ చిత్రమో అందరికి తెలుసు. ” బాషా! మాణిక్ బాషా! ఒక్క సారి చెపితే వందసార్లు చెప్పినట్లు” అనే డైలాగు బాలయ్య బాబు నోటి వెంట పలికి ఉండి ఉంటె ఎలా ఉండేది ? ఈ ఇమాజినేషన్ ఏందబ్బా! అనుకోకండి, ఈ అరుదయిన అవకాశాన్ని తెలుగు ప్రేక్షకులు తృటిలో మిస్ అయ్యారు, ఎలాగో తెలుసా? సూపర్, డూపర్ హిట్ అయిన బాషా చిత్రాన్ని నిర్మాతలు తెలుగులోకి డబ్ చేయాలని అనుకున్నారు , దర్శకు డు సురేష్ కృష్ణ మాత్రం రీమేక్ చేస్తే బాగుంటుంది, ఇందులో బాలయ్య నటిస్తే బాగుంటుంది అనుకోని, దేవి శ్రీ థియేటర్ లో సినిమా స్పెషల్ షో వేసి తెలుగు ఇండస్ట్రీ లో వారిని ఆహ్వానించారు.

బాలయ్య బాబు కూడా ఈ సినిమా చూసారు కానీ బాడ్ లక్ ఏమిటంటే, మన తెలుగు వారికీ ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. సహజం గ బాలయ్య బాబు రీమక్స్ కి కొంచెం దూరంగా ఉంటారు, ఈ నేపధ్యం లో బాలయ్య బాబు ఈ అవకాశాన్ని లైట్ గ తీసుకున్నారు, కట్ చేస్తే తమిళ్ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేసారు . బాలయ్య ఒప్పుకొని ఉండి ఉంటె, బాషా సినిమా నేరుగా తెలుగులో వచ్చి ఉండేది, ఆలా వచ్చి ఉంటె అది ఏ రేంజ్ లో ఉండేదో ఒక్క సారి ఊహించండి, ఆన్ బిలీవబుల్ కదూ? ఏది ఏమయినా, తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఒక గొప్ప అవకాశాన్ని మిస్ అయ్యారు అనటంలో ఎటువంటి సందేహం లేదు..

Varsha Bollamma cute Pictures at ‘Stand Up Rahul’ Interview!

Mehreen pirzada ‘Sparks’ With Young Hero!