in

MEGASTAR’S LOVE TOWARDS SUPERSTAR!

క్కడు’తో మొదలుపెట్టి తరచుగా రికార్డుల మోత మోగిస్తూ సాగిసోతున్నాడు మన సూపర్ స్టార్. చివరగా సంక్రాంతికి విడుదలైన మహేష్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ యావరేజ్ కంటెంట్‌తోనే కలెక్షన్ల మోత మోగించింది. ఇప్పుడిక ‘సర్కారు వారి పాట’తో సందడికి సిద్ధమవుతున్నాడు మహేష్. పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన దీని మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో టాలీవుడ్ టాప్ సెలబ్రెటీలందరూ మహేష్‌ మీద తమ అభిమానాన్ని చూపిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. అందరిలోకి మెగాస్టార్ చిరంజీవి విష్ ప్రత్యేకం. మహేష్‌ను తన బిడ్డలా భావిస్తానంటూ ‘సరిలేరు..’ ఆడియో వేడుకలో ఎంత ప్రేమగా మాట్లాడాడో తెలిసిందే. తన ట్వీట్లో కూడా మహేష్ మీద ప్రేమను దాచుకోలేదాయన. ‘‘అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, హ్యాపీ బర్త్ డే మహేష్. ఈ ఏడాదంతా నీకు గొప్పగా సాగాలి’’ అని చిరు ట్వీట్ వేశాడు.మహేష్‌ను మీరు అని గౌరవిస్తూ చిరు ఇలా ట్వీట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది..

kajal demands 70 lakhs for her character!

samantha and rashmika acting as sisters?