తాజాగా రానా నటిస్తున్న హిందీ సినిమా ‘హాథీ మేరే సాథీ’ చిత్రంలో కాజల్ అరగంట పాటు వుండే ఒక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కాజల్ రూ.70 లక్షల పారితోషకం తీసుకున్నట్లు ఫిలిం నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కాజల్ ఆదివాసి యువతిలా కనిపించనుంది. ఆదివాసీల సంప్రదాయానికి తగ్గట్టుగానే కాజల్ బ్లౌజ్ వేసుకోకుండా కేవలం చీరకట్టులోనే కనిపించనుందంట.
రానా, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన నేనే రాజు నేను మంత్రి సినిమా ఎంత సూపర్ హిట్ అయిన విషయంత తెలిసిందే. అందులో వీరిద్దరి కాంబినేషన్ సూపర్ ఉందంటూ ప్రేక్షకులు కితాబిచ్చారు. మరి కాజల్, రానా మరోసారి కలిసి నటిస్తున్న హాథీ మేరే సాథీ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ సినిమా తెలుగులో ‘అరణ్య’ తమిళంలో ‘కాదన్’ హిందీలో ‘హాథీ మేరే సాథీ’, గా ప్రేక్షకుల ముందుకు రానుంది.