తెలుగు చిత్రపరిశ్రమతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్నారు సమంత. మాతృభాష కన్నడతో పాటు తెలుగులో, తాజాగా ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు రష్మికా మందన్నా. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లుగా సత్తా చాటుతున్న సమంత, రష్మిక కలసి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. అది కూడా అక్కాచెల్లెళ్లుగా నటించనున్నారని టాక్. ఇటీవల ఓ యువ దర్శకుడు అక్కాచెల్లెళ్ల నేపథ్యంలో కథని రెడీ చేసి, సమంత, రష్మికలకు ఫోన్లో వినిపించారట. ఇద్దరికీ నచ్చడంతో నటించేందుకు పచ్చజెండా ఊపారనే ప్రచారం జరుగుతోంది.