in

Mannara Chopra opens up about the kiss controversy with director!

హీరోయిన్ మన్నారా చోప్రాతో కలిసి ఫొటోలకు పోజులు ఇస్తూ.. ఆమెకు సడెన్‌గా ముద్దిచ్చేశాడు. ఆశ్చర్యపోయిన మన్నారా..స్టేజ్ మీద తన కోపాన్ని చూపించకుండా నవ్వుతూ ఉండిపోయింది..రవికుమార్ చౌదరి ప్రవర్తనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మన్నారా బాలీవుడ్ హీరోయిన్ కావడంతో జాతీయ స్థాయిలో ఈ వీడియో ట్రెండ్ అయింది. రవికుమార్‌ మీద ఒక రేంజిలో ట్రోలింగ్ జరిగింది. ఐతే ఈ వివాదంపై మన్నారా కానీ, రవికుమార్ కానీ ఆ సమయంలో ఏమీ స్పందించలేదు..

కాగా హిందీ ‘బిగ్ బాస్’ షోకు పార్టిసిపెంట్‌గా వెళ్లిన మన్నారా..ఈ వివాదం గురించి అక్కడ మాట్లాడింది. రవికుమార్ ముద్దును వేరే రకంగా చూడొద్దని, అతను తనకు తండ్రి లాంటి వాడని ఆమె చెప్పడం విశేషం. ‘‘తిరగబడరా స్వామి ప్రమోషన్స్ ఊహించని మలుపు తిరుగుతాయని నేను అనుకోలేదు. రవికుమార్ గారికి నేను చిన్న పిల్లతో సమానం. ఆయన్ని నేను తండ్రితో సమానంగా భావిస్తా. చాలా రోజుల తర్వాత నన్ను చూడటంతో ఆనందంతో ఆయన అలా ముద్దు పెట్టారు..!!

happy birthday jyothika!

mrunal thakur: i want to do all kinds of films in north and south