in

Manmadhudu’ heroine anshu in Young Tiger movie?

కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమాను ప్రేక్షకులను అంతా సులువుగా మర్చిపోరు. నాగ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది ఈ సినిమా. ఈ ముద్దుగుమ్మ తన ఇనోసెంట్ నటనతో ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా తర్వాత అన్షు మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. మన్మధుడు కంటే ముందు ప్రభాస్ తో కలిసి ‘రాఘవేంద్ర’ సినిమాలో నటించింది.ఆతర్వాత శివాజి-లయ-భూమిక నటించిన ‘మిస్సమ్మ’లో అతిథిపాత్రలో మెరిసింది.

ఈ సినిమాల తర్వాత అన్షు సినిమాలకు దూరం అయ్యింది. కాగా ఇప్పుడు ఈ భామ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది..యంగ్ టైగర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ”అయిననూ పోయిరావలె హస్తినకు” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో అన్షు నటించనుందని ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో కీలక పాత్ర కోసం అన్షు ను ఎంపిక చేశారట దర్శకుడు త్రివిక్రమ్.

Uppena Telugu Movie Trailer, Panja Vaisshnav Tej, Krithi Shetty, Vijay Sethupathi!

nara rohit as mla in balayya – boyapati movie!