in

Manchu Family Gearing Up for a 100 Crore Budget film!

మంచు మోహన్ బాబు ఈ మధ్య తిరుమల వెళ్ళినప్పుడు మీడియా ముందుకు వచ్చి మంచు విష్ణుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఆ సినిమా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది అని చెప్పడమే కొసమెరుపు. మంచు విష్ణుతో 100 కోట్ల సినిమానా? అని అక్కడున్న వాళ్ళే నోరెళ్ళబెట్టారు. ఎందుకంటే మంచు విష్ణుకి ఇప్పుడు మహా అయితే 20 కోట్ల రూపాయల మార్కెట్ ఉందేమో. అసలు విష్ణు హిట్ కొట్టే చాలా కాలమైంది. ఒకవేళ హిట్ అయినా అంతకు మించి ఆశించడం కూడా కష్టమే. మరి 20 కోట్లు మార్కెట్ ఉన్న హీరోతో 100 కోట్ల సినిమా అంటే ఆడంబరం అనుకునేవాళ్లు ఉన్నారు. అయినా ఆయన డబ్బులు ఆయన ఇష్టం మీకేంటి నొప్పి అంటారా? మనం అలా అనుకున్నా ట్రోలర్స్, మేమర్స్ అలా అనుకోరు కదా? వాళ్ళ పని వాళ్ళు మొదలెట్టేసారు..!!

NATASEKHARA KRISHNA THE TRUTH TELLER!

Naga Chaitanya turns into a fishing boat driver!