in

Manasa Varanasi onboard for Sharwanand–Sreenu Vaitla film!

ర్వానంద్, వరుస హిట్‌లతో దూసుకుపోతూ తన మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. తాజాగా ఆయన శ్రీనువైట్లతో చేతులు కలపడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. శ్రీనువైట్ల అంటేనే మనకు గుర్తొచ్చేది కడుపుబ్బ నవ్వించే వినోదం. అయితే ఈసారి ఆయన కేవలం కామెడీకే పరిమితం కాకుండా, దానికి ‘టైమ్ ట్రావెల్’ అనే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌ను జోడిస్తున్నారు. శర్వానంద్ టైమింగ్‌కు, శ్రీనువైట్ల మార్క్ హ్యూమర్‌కు తోడు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త మేజిక్ జరుగుతుందని చిత్రబృందం భావిస్తోంది..

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే ఉత్కంఠకు తెరపడినట్లు కనిపిస్తోంది. మొదట స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, చివరకు మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసిని ఖరారు చేసినట్లు సమాచారం. ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మానసకు, శర్వానంద్ పక్కన ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఈ కొత్త జోడీ వెండితెరపై ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ ఫీల్‌ను ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది..!!

happy birthday ram pothineni!

Ranbir Kapoor buys land in Ayodhya ahead of Ramayana release!