in

Pooja Hegde Dating Rohan Mehra? Everything You Need to Know

టాలీవుడ్ కుర్రకారు గుండెల్లో బుట్టబొమ్మగా గూడు కట్టుకున్న పూజా హెగ్డే ఇప్పుడు వెండితెరపైనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ వార్తల్లో నిలుస్తోంది..గత కొంతకాలంగా ఈ పొడుగుకాళ్ల సుందరి ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ పూజ ఒక బాలీవుడ్ కుర్ర హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది..

పూజా హెగ్డే మనసు దోచుకున్న ఆ అదృష్టవంతుడు మరెవరో కాదు.. బాలీవుడ్ దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రా. 2018లో సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘బజార్’ సినిమాతో రోహన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. గత కొంతకాలంగా ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్లు, సినీ పార్టీల్లో ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరాలకు చిక్కుతున్నారు. ముఖ్యంగా పూజ తన తల్లిదండ్రులతో కలిసి డిన్నర్ వేడుకలకు వెళ్లినప్పుడు కూడా రోహన్ అక్కడే ఉండటం చూస్తుంటే, వీరి బంధం కేవలం స్నేహానికే పరిమితం కాదని, పెద్దల అంగీకారంతో పెళ్లి దిశగా అడుగులు వేస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు..!!

Mrunal Thakur in Talks for Venu Yeldandi’s Yellamma?