ప్రేమమ్ హీరో పై నటి పోలీస్ కేసు
మలయాళ ఇండస్ట్రీని హేమ కమిటీ ఇరుకున పడేసింది. పలువురు ప్రముఖ నటులపై లైంగిక ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై యాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తోపాటు మిగతా సభ్యులు రాజీనామా చేయడం తదితర విషయాలు ఇంటెస్ట్రింగ్ మారాయి. ఇప్పుడు ప్రేమ్ సినిమాతో తెలుగోళ్లకు దగ్గరైన హీరో నివీన్ పౌలీపై ఓ నటి పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నివీన్ పౌలి స్పందించారు. మీడియా సమావేశం పెట్టారు. తనపై ఆరోపణలు చేసిన నటి ఎవరో తనకు తెలియదన్నారు.
మలయాళం నటుడు నివిన్ పౌలీ పై లైంగిక ఆరోపణలు
తనన వేధింపులకు గురిచేశారంటూ ఓ యువ నటి ఫిర్యాదుతో హీరో నివీన్ పౌలి తో సహా మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. నటి ఆరోపణలను ఖండిస్తూ మంగళవారం అర్థరాత్రి నివీన్ పౌలి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇదొక కుట్రలా ఉందన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరు మాత్రమే తనకు తెలుసని తెలిపారు. ఎఫ్ ఐఆర్ నమోదు అయ్యింది. న్యాయపరంగా నేను పోరాడుతాను. నా నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను ఉంటాయన్నారు..!!