in

‘major’ beauty Sobhita Dhulipala’s Middle Finger Gesture Goes Viral!

తెలుగమ్మాయి శోభితా ధూళిపాల టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లో తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా ఆఫర్లు చేజిక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైంది. ఇటీవలే ఆమె నటించిన మేజర్ సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమాలతోనే కాకుండా.. నాగచైతన్యతో ప్రేమలో ఉన్నట్లు వస్తున్న ఊహాగనాలతోనూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై సదరు హీరోయిన్ కానీ, నాగచైతన్య కానీ ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు. తరచూ వీరిద్దరూ ఒకే హోటెల్‌లో నివాసముండటంతో ఆ వార్తలకు బలం చేకూరుతున్నాయి. తాజాగా శోభితాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిరు వీడియో క్లిప్‌లో శోభితా.. తన మిడిల్ ఫింగర్‌ను ఎవరికో చూపిస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే ఆమె అలా ఎవరికీ చూపించిందని, ఎందుకు ప్రవర్తించిందనే అనే విషయంపై స్పష్టత లేదు. అయితే నెటిజన్లు మాత్రం ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు. నాగచైతన్యతో తన లవ్ ఎఫైర్ గురించి తరచూ మాట్లాడుతున్నందునే ఈ విధంగా ఆమె రియాక్ట్ అయిందని కామెంట్లు పెడుతున్నారు..నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ వీడియో శోభితా పోస్ట్ చేసింది కాదు. ర్యాండమ్‌గా సోషల్ మీడియాలో కనిపించిందీ వీడియో. అయితే ఈ వీడియో చాలా పాతదై ఉంటుందని, ప్రస్తుతం ఆమె రిలేషన్‌షిప్‍‌‌పై వస్తున్న రూమర్ల వల్ల అది తెరపైకి వచ్చి ఉంటుందని కొంతమంది భావిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ శోభితా-నాగచైతన్య రిలేషన్‌షిప్ ఊహాగానాలు ఇప్పడప్పుడే తగ్గేలా కనిపించట్లేదు.

ANCHOR ANASUYA IN A NEVER-SEEN-BEFORE ROLE!

CHETHILO 120 RUPEES THO CINEMA MODALU PETTINA K. S. R. Das!