in

CHETHILO 120 RUPEES THO CINEMA MODALU PETTINA K. S. R. Das!

కె.ఎస్.ఆర్. దాస్,(కొండా సుబ్బరామ దాసు) డైరెక్టర్ గ యాక్షన్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్. శత చిత్ర దర్శకుడు, ఒక్క కృష్ణ గారు హీరో గ 40 చిత్రాలు డైరెక్ట్ చేసిన అరుదయిన దర్శకుడు. క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ అనేది చిన్న నాడే దాస్ గారి జీవితం తో పెన వేసుకొని పోయింది, దాస్ గారి నాన్న గారు, బాబాయి, వేంకటగిరి సంస్థానంలో పన్నులు వసూలు చేసే పని చేసే వారు, ఆ క్రమం లోనే దాస్ గారి బాబాయి ని ఎవరో హత్య చేసారు, కానీ దానికి ఆధారాలు లేవు, దాస్ గారి నాన్న గారు, దాస్ ని వెంటేసుకొని ఒక ప్రైవేట్ డిటెక్టివ్ లాగా ఇన్వెస్టిగేట్ చేసి, తమ్ముడి హంతకులను గుర్తించి పోలీసులకు పట్టించారు. చిన్న వయసులో మనసులో పడిన నేర పరిశోధన, ఆ తరువాత ఇంగ్లీష్ మూవీస్ చూడటం, డిటెక్టివ్ నవల్స్ చదవటం తో మరింత పెరిగింది. ఆ ఇంటరెస్ట్ కాలక్రమంలో దాస్ గారిని క్రైమ్ చిత్రాల వైపు తిప్పింది, దాస్ అంటే యాక్షన్, యాక్షన్ అంటే దాస్ అనే స్థాయి కి తీసుకొని వెళ్ళింది. దాస్ గారి సినిమాలే కాదు అయన జీవితం కూడా ఎంతో ఉత్కంఠభరితం. చేతిలో 120 రూపాయలతో సినిమా ప్రారంభించిన తెలివయిన వాడు దాస్ గారు.

ఎడిటర్ గ సినీ జీవితాన్ని ప్రారంభించి, దర్శకుడిగా ఎదిగారు దాస్, మొదటి చిత్రం “లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక” డిసాస్టర్, దెబ్బతో చేస్తున్న ఎడిటర్ ఉద్యోగం కూడా ఊడింది. ఇంకో సంస్థలో ఎడిటర్ ఉద్యోగం సంపాదించి, ఎలాగయినా డైరెక్టర్ గ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే ” వక్త్” అనే హిందీ సినిమా ఆధారంగా ఒక జానపద కథ తయారు చేసుకున్నారు ఆ కథను మేక్ అప్ వీర్రాజు గారికి వినిపించారు, కథ చాల బాగుంది ఎవరికయినా ఇస్తే డబ్బులు వస్తాయి అని చెప్పారు, లేదు ఈ సినిమాకు నువ్వే నిర్మాత నేను డైరెక్ట్ చేస్తాను అన్నారట దాస్ గారు, నా దగ్గర 120 రూపాయలు ఉన్నాయి అనగానే ఆ డబ్బులు తీసుకొని ఒక్క రుపాయ తో తాంబూలం కొని 116 రూపాయలు అందులో పెట్టి రచయిత వీటూరి గారి చేతిలో పెట్టి మీరే మా సినిమాకు రచయిత, అని చిత్రానికి అంకురార్పణ చేసారు.

తెలుగు చిత్రాలను తమిళ్ లోకి డబ్ చేసే పురుష్య దాసన్ అనే ప్రొడ్యూసర్ ని పట్టుకొని ఈ కథను వినిపించి,తమిళ్ రైట్స్ పాతిక వేలకు అమ్మి ఒక అయిదు వేలు అడ్వాన్స్ తీసుకొని ఆ డబ్బు తో అప్పటి వరకు ధోలక్ కళాకారుడిగా జీవితం సాగిస్తున్న, సత్యం గారిని మ్యూజిక్ డైరెక్టర్ గ తీసుకొని, సింగర్స్ బాలు, సుశీల, జానకి గార్లకు తలా ఒక వంద రూపాయలు ఇచ్చి, వారితో పాటలు పాడించేసారు. హీరో కాంత రావు గారిని కలసి సినిమా పూర్తి అయి రిలీజ్ అయ్యాక డబ్బులు ఇస్తానని ఆయనను ఒప్పించి షూటింగ్ ప్రారంభించేసారు. షూటింగ్ జరుగుతుండగా విజయవాడ లో తెలుగు చిత్రాల డిస్ట్రిబ్యూటర్నికలసి కథ వినిపించారు, వారికి ఆ కథ నచ్చటం తో ఈ చిత్రాన్ని రెండున్నర లక్షలకు బేరం కుదుర్చుకొని వారి వద్ద పాతిక వేలు అడ్వాన్స్ తీసుకొని చిత్రం షూటింగ్ పూర్తి చేసేసారు. ఆ చిత్రం పేరే “రాజ యోగం” ఒక మోస్తరు హిట్ అయి లాభాలు తెచ్చి పెట్టింది, దాస్ గారికి రాజా యోగం పట్టింది, ఆ తరువాత వరుస సినిమాలతో చెలరేగి పోయారు దాస్ గారు.

‘major’ beauty Sobhita Dhulipala’s Middle Finger Gesture Goes Viral!

Did pigeons cause heroine Meena’s husband’s death?