in

mahesh babu to release mega hero’s song!

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఉప్పెన. ఈ సినిమాతో వైష్ణవ్‌ హీరోగా పరిచయం కానున్నారు. కీర్తీ శెట్టి ఫీమెల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే థియేటర్లలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలవ్వగా ఇవి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకున్నాయి.

ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తర్వాత విడుదలైన ‘దక్‌ దక్‌ దక్‌’ పాట కూడా అంతే హిట్‌ అయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయనున్నారు. అది కూడా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా. ఉప్పెన సినిమాలోని ‘రంగులద్దుకున్న’ అనే పాటను మహేష్‌ బాబు నవంబర్‌ 11న సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు.

indirect ga telugu desam party ku campaign chesina krishna!

nabha natesh revealed why she signed ‘Andhadhun’ remake!