in

Mahesh Babu To Play Lord Ram In Madhu Mantena’s ‘ramayana’?

రామాయణం, మహాభారతం ఈ రెండు మహాకావ్యాలను సినిమాగా తెరకెక్కించాలని దేశంలో చాలా మంది దర్శకులు కలలు కంటుంటారు. కానీ వీటిని తెరకెక్కించాలంటే భారీ కాస్టింగ్, బడ్జెట్ కావాలి అంతేకాకుండా ఏమాత్రం తేడా జరిగిన వివాదాల్లో సినిమా కనుమరుగవుతుంది. అయితే తాజాగా రామాయణం నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పుడు మరో దర్శకుడు రామాయణాన్ని రూపొందించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు.

అంతేకాకుండా ఈ రామాయణం సినిమాను 3డీలో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో రావణుడి పాత్రలో హృతిక్ రోషన్, సీత పాత్రలో దీపికా పదుకొణె చేయనున్నట్లు ఇప్పటికే తేలింది. అయితే ఈ సినిమాలో రాముని పాత్ర ఎవరు చేస్తారని అభిమానుల్లో సందేహాలు వస్తున్నాయి. వాటికి తాజాగా సమాధానం దొరికింది. మధు మంతెన రూపొందిస్తున్న రామాయణం 3డీలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రామునిగా కనిపిచంనున్నారంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pooja Hedge to romance again with Naga Chaitanya!

Mythri Movie Makers confirm project with Jr NTR and Prashanth Neel!