in

mahesh babu rejected ‘animal’!

ర్జున్ రెడ్డి’ తర్వాత తన రెండో సినిమాను మహేష్ బాబుతోనే చేయాలనుకున్నాడు సందీప్. మహేష్‌తో సంప్రదింపులు కూడా జరిగాయి. కానీ ఎందుకో సినిమా ముందుకు కదల్లేదు. ఈలోపు ‘అర్జున్ రెడ్డి’ హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ రిలీజై అక్కడా సెన్సేషన్ క్రియేట్ చేయడం.. తన వర్క్ నచ్చి రణబీర్ కపూర్, భూషణ్ కుమార్ తర్వాతి సినిమాకు కమిట్ కావడంతో ‘యానిమల్’ పట్టాలెక్కింది. ఇప్పుడు ఈ సినిమా ప్రోమోలు చూస్తూ సందీప్‌తో ఒక్క సినిమా చేయాలని స్టార్ హీరోలందరూ తహతహలాడుతుంటే ఆశ్చర్యం లేదు.

కాగా సందీప్‌తో సినిమా చేసే అవకాశాన్ని మహేష్ ఎలా వదులుకున్నాడని అతడి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కొన్నేళ్లుగా మహేష్ సినిమాలు ఒక మూసలో సాగిపోతున్నాయి. అతడిలోని పెర్ఫామర్‌ను దర్శకులు సరిగా వాడుకోలేదనే బాధ వారిలో ఉంది. ‘యానిమల్’ లాంటి సినిమా చేస్తే మహేష్‌ అభిమానులకు మామూలు కిక్ ఉండేది కాదు. అతడికి బాగా సూటయ్యే పాత్రలానూ కనిపించింది. కాకపోతే వయొలెన్స్ డోస్ మరీ ఇంతైతే కష్టమయ్యేదేమో. కానీ మహేష్ ఇలాంటి కథలో నటిస్తే మాత్రం బాక్సాఫీస్ షేకైపోవడం ఖాయం..!!

Allu Arjun and Trivikram’s Socio-Fantasy movie?

telugu actress vimala raman dating kannada villain!