in

Allu Arjun and Trivikram’s Socio-Fantasy movie?

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. గుంటూరు కారం షూటింగ్ చివరిదశకు చేరుకోగా సంక్రాంతి కి రిలీజ్ అవుతున్నందువల్ల దాని కోసం ఇప్పట్నుంచే ప్రమోషన్లు స్టార్ట్ చేసారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మొదలుకొని టీజర్ ఇంకా సాంగ్ హైప్ ని ఓ రేంజ్ లో పెంచేయగా, ఆ తర్వాత సాంగ్స్ ని కూడా వెంట వెంటనే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇక గుంటూరుకారం తరువాత గురూజీ అల్లు అర్జున్ తో మరో సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ని నిర్మాత బన్నీ వాసు చెప్పడం జరిగింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న బన్నీ వాసు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని పంచుకున్నారు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో లో రాబోయే నాలుగో సినిమా ఒక సోషియో ఫాంటసీ జోనర్లో తెరకెక్కుతున్న సినిమా అని, దీన్ని భారీ పాన్ ఇండియా సినిమాగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నామని అన్నారు. అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కే ఏడాదిన్నర సమయం పడుతుందని బన్నీ వాసు చెప్పడం జరిగింది..!!

Meenakshi Choudhary and Trisha in balayya’s next?

mahesh babu rejected ‘animal’!