in

mahesh babu accepted ram charan’s rejected movie?

ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

వెంకీ కుడుముల దర్శకత్వంలో ఇటీవల నితిన్‌, రష్మిక మందన కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ సూపర్‌ హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం వెంకీ కుడుముల ఇటీవల ఓ సరికొత్త కథతో హీరో రామ్‌ చరణ్‌ను కలిసినట్లు సమాచారం. అయితే ఈ కథకి పెద్దగా రామ్ చరణ్ ఇంప్రెస్ కాకపోవడంతో నో చెప్పాడట. దీంతో వెంటనే వెంకీ మహేష్‌ బాబు వద్దకు వెళ్లి ఇదే కథ వినిపించగా ఈ సినిమాలో నటించేందుకు మహేష్ ఆసక్తి చూపించినట్టుగా సమాచారం.

boyapati gives Interesting Role for Pragya Jaiswal!

BALAYYA’S NEXT WITH ‘RABASA’ DIRECTOR?