మాధవీలత నటిగా కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫెమస్ అయ్యింది. నిత్యం ఎదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇక ఈ అమ్మడిని కొంతమంది వదిన అని పిలుస్తున్నారట. వాళ్ళు ఎవరో కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . పవన్ కళ్యాణ్ ను అభిమానులు ప్రేమగా అన్న అని పిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ను కూడా పవన్ అభిమానులు వదిన అని పిలుస్తుంటారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాధవీలతను కూడా వదిన అని పిలుస్తున్నారట. ఇటీవల పవన్ పుట్టిన రోజుకు ఆమె శుభాకాంక్షలు తెలుపగా పవన్ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. అయితే తాజాగా ఒక నెటిజన్ ఆమెను వదిన అని సంబోదించగా..దానికి మాధవీలత స్పందిస్తూ… మీకు దండం నేను మీకు పీకే అన్న అయివుండొచ్చు కానీ నేను వదిన కాదు. అక్క అని పిలవండి చాలు. అని సమాధానం ఇచ్చింది. ఇక మాధవీలత ఇటీవల పవన్ కు సోషల్ మీడియా వేదికగా ఓ భారీ లేఖను రాసినిమా విషయం తెల్సిందే. గతంలో కూడా మాధవీలత పవన్ పై పలు విమర్శలు చేసింది.