ఈ టీవీ సంస్థ యజమాని రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ నుండి వచ్చినా సినిమాలే చాలా ఉన్నాయి. వీటిని ఈటీవీలో తప్ప మరెక్కడా చూడలేం. ఇప్పుడు ఆ సినిమాలన్నింటినీ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ఎన్ని రిలీజ్ చేసినా.. ఒరిజినల్ కంటెంట్ కూడా ఉండాలి కదా.. అందుకే సినిమాలు, టాక్ షోలు, వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారు.
వీటి కోసం రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారట..ఉషాకిరణ్ బ్యానర్ మీదే చిన్న సినిమాలను నిర్మించి ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటికీ ఈటీవీ సంస్థలో కొన్ని స్క్రిప్ట్ లను లాక్ చేసి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కొందరు యంగ్ డైరెక్టర్లతో ఈ సినిమాలను రూపొందించనున్నారు. యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంతో పాటు ఎక్కువ కంటెంట్ ను జెనరేట్ చేయాలని నిర్ణయించుకున్నారు.