in

liger not effecting kushi!

సినిమాల బిజినెస్ జరిగేది ప్రధానంగా హీరోల ఇమేజ్, మార్కెట్‌ను అనుసరించే. వాళ్ల చివరి సినిమాలు సాధించిన వసూళ్లను అనుసరించే కొత్త చిత్రాలకు రేట్లు పలుకుతుంటాయి. వరుస ఫెయిల్యూర్లలో ఉన్న హీరో కొత్త చిత్రానికి బిజినెస్ పరంగా ఇబ్బందులు తప్పవు. అందులోనూ చివరి సినిమా ఇండస్ట్రీ చరిత్రలోే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచినపుడు నెగెటివ్ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఈ విషయంలో మినహాయింపుగానే కనిపిస్తున్నాడు. అతను చివరగా ‘గీత గోవిందం’ మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు.

ఆ తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు చూశాడు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్‌తో పాటు ‘లైగర్’ ఎంతగా నిరాశ పరిచాయో తెలిసిందే. ముఖ్యంగా ‘లైగర్’ అయితే టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ప్రభావం విజయ్ కెరీర్ మీద బాగానే పడుతుందని అనుకున్నారు. కానీ విజయ్ కొత్త చిత్రం ‘ఖుషి’కి అంచనాలకు మించే బిజినెస్ జరిగింది. ‘లైగర్’ తర్వాత విజయ్‌ కెరీర్లో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రం ఇదే. ‘ఖుషి’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు రూ.52 కోట్లు పలకడం విశేషం..!!

dusky beauty pooja hedge following social media strategy!

mega star chiranjeevi the Real Trend Setter!