
ప్రముఖ నటి, కొణిదెల వారి కోడలు లావణ్య త్రిపాఠి తన కెరీర్‌లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత ‘సతీ లీలావతి’ చిత్రంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో తాను కూడా వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు.
కెరీర్ ఆరంభంలో ఓ తమిళ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడనీ దాంతో ఆ సినిమానే వదులుకున్నానని, దీనిపై చిత్రబృందం తన మీద కేసు పెట్టిందన్నారు. అంతటితో ఆగకుండా మీడియాలోనూ తప్పుడు కథనాలు రాయించారని, ఆ ఘటనతో మానసికంగా తాను కుంగిపోయానని తెలిపింది. అలాగే, బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘గీత గోవిందం’ చిత్రంలో హీరోయిన్‌గా తొలి అవకాశం తనకే వచ్చిందని, అయితే ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ ఆఫర్‌ను వదులుకోవాల్సి వచ్చిందని లావణ్య వెల్లడించారు..!!

