in

Keerthy Suresh Gives Clarity About Surgery!

హీరోయిన్‌లు అవకాశాలకు తగ్గట్లుగా మారుతూ ఉండాలి. అప్పుడే, వారు లైమ్ లైట్ లో ఉంటారు. ప్రస్తుతం కీర్తి సురేష్ పరిస్థితి కూడా అదే. పెళ్లి తర్వాత ఆమెలో ఆ మార్పు సహజమే అంటూ నెటిజన్లు కూడా పోస్ట్ లు పెడుతున్నారు. ఐతే, ఆమె.. సర్జరీలు చేయించుకుందంటూ తన లుక్‌పై కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు కీర్తి చెక్ పెడుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఇన్‌స్టా వేదికగా కీర్తి పోస్ట్ పెడుతూ..‘ఈ విషయం పంచుకోవడానికి ఇదే సరైన సమయం. నేను నా ఫిట్‌నెస్‌ ప్రయాణం గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. అదే నాకు అతి పెద్ద గురువు’ అని ఆమె చెప్పుకొచ్చింది.

కీర్తి తన పోస్ట్ లో ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి 2013లో నటిగా కెరీర్‌ ప్రారంభించినప్పుడు ఏమీ తెలియదు. చాలామందిలాగే జిమ్‌ నా కోసం కాదని అనుకున్నా. కానీ ‘మహానటి’ తర్వాత ఒక విరామ సమయంలో అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవడం మొదలు పెట్టాను. అలా 9నెలల్లో 10కిలోలు తగ్గాను. కానీ ప్రజలు నన్ను చూసి ‘చాలా వీక్‌ అయిపోయింది’, ‘సర్జరీలు చేయించుకుంద’ని అన్నారు. ఆ తర్వాత 2020లో యోగా చేయడం మొదలు పెట్టాక.. నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు నాకు ఇష్టం లేనిది..ఇప్పుడు అస్సలు వదిలిపెట్టుకోలేనిదిగా మారింది’’ అని ఆ పోస్ట్‌లో కీర్తి తెలిపింది..!!

Lavanya Tripathi recalls harrowing experience with Tamil director!

Sreeleela and cricketer Tilak Varma in a relationship?