in

Lakshmi Manchu’s ‘Chitti Chilakamma’ YouTube channel hacked!

హ్యాకర్స్ సెల‌బ్రిటీల అకౌంట్స్‌పై ఎప్పుడు ఓ క‌న్నేసి ఉంచుతార‌నే విష‌యం తెలిసిందే. ఛాన్స్ దొరికిన‌ప్పుడల్లా వారి ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ త‌ర‌చు హ్యాక్ చేస్తూ వారిని ఆందోళ‌న‌కు గురి చేస్తున్నారు. తాజాగా మంచు వార‌మ్మాయి ల‌క్ష్మీ యూట్యూబ్ ఛానెల్‌ని హ్యాక్ చేశారు. కొద్ది రోజుల క్రితం పిల్ల‌ల కోసం చిట్టి చిల‌క‌మ్మా అనే యూట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేసింది..ఇందులో త‌న కుమార్తె విద్యా నిర్వాణ ద్వారా పిల్ల‌ల పెంప‌కం, చ‌దువు బోధించే ప‌ద్ద‌తుల గురించి వివ‌రిస్తూ వ‌స్తుంది ల‌క్ష్మీ. అయితే ఇప్పుడు త‌న యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ అయింద‌ని, దీని నుండి త‌ప్పుడు స‌మాచారం వ‌స్తే ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, త‌మ టీమ్ సైట్‌ను తిరిగి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని పేర్కొంది.

I don’t have daddy or mommy helping me, says shruthi haasan!

9 years for gabbar singh!