in

lady villain in balayya – koratala siva’s film?

బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో అప్‌డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో ఐశ్వర్య రాజేష్ పేరు వినిపించడం విశేషం. సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్‌ను హీరోయిన్‌గా కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్ర కోసం సంప్రదించారట. బాలకృష్ణకు జోడీగా ఆమె కనిపించదని, కథను మలుపు తిప్పే బలమైన పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి..

అయితే ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాకు మెయిన్ విలన్ మాత్రం కాదట. ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం మరో స్టార్ నటుడిని తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. అంటే ఐశ్వర్య పాత్ర విలన్ వైపు నిలిచినా, కథలో ఆమె స్థానం ప్రత్యేకంగా ఉండబోతోందన్న మాట. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఐశ్వర్య రాజేష్‌కు ఇది మరో డిఫరెంట్ రోల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎక్కువగా సహజమైన, భావోద్వేగ పాత్రల్లో కనిపించిన ఆమె ఈసారి నెగెటివ్ షేడ్స్‌లో కనిపిస్తే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వొచ్చు..!!

star beauty Sai Pallavi in Talks for a Telugu Film!

struggling beauty Pooja Hegde in Ravi Teja multi starrer!