in

struggling beauty Pooja Hegde in Ravi Teja multi starrer!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న భామ పూజా హెగ్డే. ‘బుట్టబొమ్మ’ అని ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా పిలుచుకునే పూజా ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. వరుస ఫ్లాపులు, బాలీవుడ్‌లో సినిమా ఛాన్సుల కారణంగా పూజా హెగ్డే దాదాపు టాలీవుడ్‌కు దూరం అయ్యింది. అయితే, దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘శ్రీశ్రీ’ అనే సినిమాలో పూజా నటిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ఇప్పుడు నేరుగా ఓ టాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్ పూజాకు వచ్చినట్లు సినీ సర్కి్ల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మాస్ రాజా రవితేజ, కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు కాంబినేషన్‌లో దర్శకుడు హసిత్ గోలి త్వరలో ఓ మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా పూజాకు ఛాన్స్ వచ్చిందట. రవితేజతో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందా అని అభిమానులు అప్పుడే ఊహించేసుకుంటున్నారు. అయితే, ఈ విషయంపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు..!!

lady villain in balayya – koratala siva’s film?

24 years for indra!