in

Kriti Sanon agreed for a special song in Jr NTR Devara?

తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ” దేవర “. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే..ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని..ఈ సాంగ్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సాంగ్ చేయడానికి కృతి సనన్ ని ఒప్పించారని టాక్. దేవర సినిమాను దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే..

మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ..ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ జోష్ ఇస్తుంది. ఎంతైనా కొరటాల ఈ దేవరా కథ కోసం చాలా నెలలు కసరత్తులు చేశాడు. మరి కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. ఇక ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఈ సినిమా వస్తుండేసరికి..ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలియాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుంది..!!

meenakshi chowdary on board for kollywood’s star hero?

After Prabhas, Mohan lal joins Vishnu Manchu’s Kannappa!