in

After Prabhas, Mohan lal joins Vishnu Manchu’s Kannappa!

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో పలువురు స్టార్స్ భాగమవుతున్నారు. ‘కన్నప్ప ఎ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్’ ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కించాలని మంచు విష్ణు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రం అన్ని భారతీయ భాషల్లో విడుదల కానుంది. మంచు విష్ణు కెరీర్ లో ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం విష్ణుతో పాటు భారీ తారాగణం నటించనుంది.

ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార శివపార్వతులు గా కనిపించనున్నారనే ప్రచారం సాగుతూ ఉంది. వీరితో పాటు ఇప్పుడు మరో సూపర్‌స్టార్‌ కూడా ఈ చిత్రంలో భాగమైనట్లు చెబుతున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ‘కన్నప్ప’లో ఒక ముఖ్యమైన పాత్ర చేయడానికి అంగీకరించారని చెబుతున్నారు. ఆయన పాత్ర, రన్‌టైమ్ గురించి రహస్యంగా ఉంచారు..!!

Kriti Sanon agreed for a special song in Jr NTR Devara?

bollywood beauty Janhvi kapoor Purchase A Luxurious Flat In Hyderabad?