
తెలుగులో బ్రూస్ లీ, ఒంగోలు గిత్త, తీన్‌మార్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కృతి కర్బందా నటుడు పులకిత్ సామ్రాట్‌తో ప్రేమాయణం నడుపుతోందని బాలీవుడ్ నాట ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పార్టీలకు, పబ్బులకు చెట్టాపట్టాలేసుకొని తెగ తిరుగతున్నారు. వారిద్దరు త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.