in

anand devarakonda enters into food business!

మెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆనంద్ దేవరకొండ తన అన్న విజయ్ దేవరకొండ దారిలో వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన స్నేహితులు నిర్వహిస్తున్న “గుడ్ వైబ్స్ ఓన్లీ” కేఫ్ లో పార్టనర్ అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆనంద్ వెల్లడించారు.

“నేను మా అన్నయ్య విజయ్ ఇద్దరం ఫుడ్ బేస్డ్ మూవీస్ తోనే మంచి సక్సెస్ అందుకున్నాం. “మిడిల్ క్లాస్ మెలొడీస్” ద్వారా వచ్చిన నా రెమ్యునరేషన్ ను ఈ ఫుడ్ బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. మా స్నేహితులు కలిసి నిర్వహిస్తున్న “గుడ్ వైబ్స్ ఓన్లీ” కేఫ్ లో భాగస్వామి అవడం సంతోషంగా ఉంది. మీ ప్రేమ వల్లే మా కలలను నెరవేర్చుకోగలుగుతున్నాం” అని ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు. హైదరాబాద్ ఖాజాగూడలో ఈ కేఫ్ ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తోంది.

Rashmika Mandanna says we eat pig meat daily!

Kriti Kharbanda shoots down rumours!