in

nagarjuna not happy with big boss organizers?

లీకుల‌ విష‌యంలో నాగార్జున కూడా బిగ్‌బాస్ టీమ్‌పై మండిప‌డ్డార‌ట‌. సీక్రెట్ రూమ్‌, ఎలిమినేష‌న్ స‌హా అన్నీ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ‌డానికి ముందే లీక‌వ‌డం ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ట‌. ఇది ఇలాగే కొనసాగితే ఇక‌పై హోస్టింగ్ చేయ‌న‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంటూ తాజాగా ఓ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. లీకుల‌కు చెక్ పెట్టేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే షో నుంచి త‌ప్పుకునేందుకు సైతం ఏమాత్రం వెన‌క‌డాన‌ని మ‌రీమ‌రీ చెప్పార‌ట‌‌.

కాగా సీజ‌న్‌ను విజ‌య‌వంతంగా న‌డిపించ‌డంలో వ్యాఖ్యాత‌ల‌ది ప్ర‌త్యేక పాత్ర‌.  అందులోనూ ఈ సీజ‌న్ మొద‌టి ఎపిసోడ్‌కు 18కి పైగా రేటింగ్ తీసుకొచ్చిన‌ నాగార్జున వంటి స్టార్ హీరోను వ‌దులుకోవ‌డానికి బిగ్‌బాస్ టీమ్ స‌సేమీరా అంగీక‌రించ‌దు. ఫ‌లితంగా ఆయ‌న చెప్పిన‌ట్టు లీకుల‌ను ఏరేసేందుకుబిగ్‌బాస్ టీమ్‌ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక త‌ప్ప‌దు. మ‌రి వారి ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీకృత‌మ‌వుతాయో? లేదో? చూడాలి..

Kriti Kharbanda shoots down rumours!

rowdy baby to play a princess in Pawan’s movie?