in

Krithi Shetty’s dream role is to play a princess!

సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతీ హీరోకు, హీరోయిన్‌కు ఏదో ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. తమ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఆ డ్రీమ్ రోల్‌లో నటించాలి అనుకుంటారు చాలామంది. అయితే బేబమ్మ కృతి శెట్టికి కూడా అలాంటి ఓ డ్రీమ్ రోల్ ఉందట. ఇప్పటికే చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న కృతి.. ఆ పాత్ర చేయడానికి అవకాశం వస్తే తప్పకుండా చేస్తానంటోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోయిన్లలో కృతి శెట్టి క్రేజే వేరు. తను నటించిన మొదటి సినిమా ‘ఉప్పెన’ విడుదల అవ్వకముందే బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలను అందుకుంది కృతి.

ఇప్పటికే డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఎన్నో సినిమాలను వదిలేసుకుంటోంది కూడా. అయితే కృతి తన డ్రీమ్ రోల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం కృతి శెట్టి.. రామ్ సరసన ‘ది వారియర్’ చిత్రంలో నటిస్తో్ంది. అంతే కాకుండా సుధీర్‌తో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాల్లో కూడా కృతినే హీరోయిన్. అయితే కృతికి రాకుమారి పాత్ర డ్రీమ్ రోల్ అని ఇటీవల బయటపెట్టింది. తనకు కెరీర్‌లో ఒక్కసారైనా ప్రిన్సెస్ పాత్ర చేయాలని ఉందని చెప్పింది కృతి. అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని కూడా తెలిపింది..

HAT TRICK SAADHICHINA RAM CHARAN!

ED seizes assets worth ₹7cr of actor Jacqueline Fernandez!