in

krishnam raju revealed about his role in ‘radhe shyam’!

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ మూవీ కావడంతో పాటు చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా కావడంతో ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. ఇక ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద కృష్ణంరాజు సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నాడని గతంలో ప్రచారం జరిగింది.

అయితే ఆ విషయం మీద అధికారిక ప్రకటన అయితే వెలువడ లేదు.కానీ నిన్న కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించి పలు కీలక అంశాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను ఆ సినిమాలో కీలక పాత్రలో నటించానని ఆయన వెల్లడించారు. రాధే శ్యాం సినిమాలో నేను పరమహంస పాత్రలో కనిపిస్తానని నా పాత్ర కి సంబంధించిన 5,6 సీన్లు ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తి అయిపోయిందన్న ఆయన ఏప్రిల్ లో విడుదల చేయడానికి చూస్తున్నామని అన్నారు.

action hero gopichand wantedly rejected rashi khanna!

shruthi haasan as lesbian in ‘lust stories’ telugu version!