in

KRISHNA, JAYA PRADA PAIRED IN 43 MOVIES!

తెలుగు చిత్ర సీమలో హిట్ పెయిర్ గ నిలిచిన సినీ జంటలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు అక్కినేని, సావిత్రి, ఎన్టీఆర్,కృష్ణ కుమారి మరియు శోభన్ బాబు, వాణిశ్రీ, ఈ కోవలోనే కృష్ణ, జయప్రద పెయిర్ కూడా హిట్ పెయిర్ గ చెప్పుకోవచ్చు. ఇప్పటి నవతరం హీరోలు ఒకే హీరోయిన్ తో వరుసగా జత కట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. మలయాళ చిత్ర సీమలో మొదటి తరం హీరో అయిన ప్రేమ్ నజీర్, షీలా అనే హీరోయిన్ తో కలసి ఏకంగా 110 చిత్రాల్లో నటించారు. అదే స్థాయి లో కృష్ణ, జయ ప్రద జంటగా 1976 – 1989 మధ్య కాలం లో 42 చిత్రాలలో నటించారు..

ఆ తరువాత చాల గ్యాప్ తరువాత 2002 లో వచ్చిన చంద్రవంశం చిత్రం లో ఇద్దరు జంటగా నటించారు. విజయ వారు, బాపు దర్శకత్వంలో 1976 లో నిర్మించిన ” శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్” తో ప్రారంభం అయిన వీరి జోడి 2002 సంవత్సరం లో వచ్చిన ” చంద్రవంశం” వరకు సాగింది. ఇంత భారీ సంఖ్యలో ఒకే హీరోయిన్ తో కల్సి నటించటం ఒక రికార్డు అయితే, అందులో 90 శాతం చిత్రాలు విజయవంతం కావటం ఇంకొక అరుదయిన రికార్డు. హీరో కృష్ణ అంటేనే రికార్డు లకు కేర్ అఫ్ అడ్రస్ అని చెప్పటానికి ఇది మరో చక్కటి ఉదాహరణ.

‘Bigg Boss is a ‘Boothu show,’ says communist Leader!

Aadavallu Meeku Johaarlu Trailer, Sharwanand, Rashmika Mandanna!