in

Krack movie to release on Aha earlier than expected!

చాలా కాలం తర్వాత క్రాక్ సినిమాతో రవితేజ సాలిడ్ హిట్ కొట్టాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. కేవలం 50% ఆక్యుపెన్సీ తోనే ఈ సినిమా మంచి షేర్ సాధిస్తోంది. ఒకరకంగా ఈ యాభై శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు రిలీజ్ చేయొచ్చా లేదా అని మీమాంసలో ఉన్న దాదాపు అందరూ ప్రొడ్యూసర్లకు ఈ సినిమా కలెక్షన్స్ అభయం ఇస్తున్నాయి.

అయితే ఈ సినిమా విడుదలై మూడు వారాలు కూడా దాటకుండానే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ ప్రకటించింది ‘ఆహా’ సంస్థ. ఈ సినిమాని జనవరి 29వ తేదీన విడుదల చేస్తున్నామని ప్రకటనలు మొదలు పెట్టింది.ప్రస్తుతం థియేటర్స్ లో మంచి వసూళ్లు సాధిస్తూ 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా మూడు వారాలు కాకుండానే డిజిటల్ గా రిలీజ్ కావడం ఎంతవరకు సబబు అని సినీ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.

balakrishna’s son Mokshagna finally set to debut with puri!

ashu reddy reveals her original name!