in

ashu reddy reveals her original name!

బిగ్ బాస్ షో ద్వారా అషూ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయింది. అంతకు ముందు డబ్ స్మాష్ అనే యాప్ ద్వారా వీడియోలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. అలా అషూ రెడ్డి అనే పేరు తెరపైకి వచ్చింది. అక్కడినుంచి అషూ రెడ్డి బిగ్ బాస్ వరకు వెళ్లింది. బిగ్ బాస్ ఇంట్లో మొదట్లో కొంచెం సైలెంట్‌గా ఉంది. ఆ తరువాత వారాలు గడుస్తున్న కొద్దీ అషూ రెడ్డి బయటకు వచ్చింది. డ్యాన్సులు, కౌంట్లు, సెటైర్లు వేస్తూ అషూ రెడ్డి బాగానే ఫేమస్ అయింది. టాస్కులు కూడా బాగానే ఆడింది.

అలా మొత్తానికి బిగ్ బాస్ వల్ల జనాలు గుర్తించడం ప్రారంభించారు. ఇక రాహుల్ సిప్లిగంజ్‌తో ఫ్రెండ్ షిప్ మొదలైన క్షణం నుంచి ఇద్దరూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. .అయితే తాజాగా అషూ రెడ్డి తన అసలు పేరు బయటకు చెప్పింది. తన అసలు పేరు అశ్వినీ రెడ్డి అని ముద్దు పేరు అషూ అని చెప్పుకొచ్చింది. తన పూర్తి పేరు కొందరికీ మాత్రమే తెలుసంది. అలా అందరూ అషూ అషూ అని పిలవడంతో ఇప్పుడు అదే ఫిక్స్ అయిపోయిందని చెప్పుకొచ్చింది.

Krack movie to release on Aha earlier than expected!

singer sunitha reaction on heroine chances!