in

krack ‘jayamma’ roped in for allu arjun’s next!

కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. సామాజికాంశాలతో ఇది రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. #AA21గా రానున్న ఈ చిత్రంలోని ప్రథమార్ధంలో స్టూడెంట్‌ లీడర్‌గా.. ద్వితీయార్ధంలో రాజకీయ నాయకుడిగా బన్నీ కనిపిస్తారని ఎన్నో రోజుల నుంచి ప్రచారం సాగుతోంది. త్వరలో చిత్రీకరణలో పాల్గొననున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇందులో ఓ స్టార్ కుమార్తె కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. నటుడు శరత్‌కుమార్‌ కుమార్తె నటి వరలక్ష్మి ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం. ఇప్పటికే ‘క్రాక్‌’లో జయమ్మగా, ‘నాంది’లో ఆద్యగా మెప్పించి తెలుగువారికి చేరువైన వరలక్ష్మి.. బన్నీ సినిమాలో రాజకీయ నాయకురాలిగా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై చిత్రబృందం ఇప్పటికే ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై ఇప్పటి వరకు చిత్ర బృందం మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.

Boxing makes me feel more powerful, says Raashi Khanna!

Nani announces Andhra-based sequel to mystery thriller ‘HIT’!