in

Nani announces Andhra-based sequel to mystery thriller ‘HIT’!

టాలీవుడ్‌‌లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు పొందుతున్నాడు విశ్వక్ సేన్. నిజానికి వెళ్లిపోమాకే సినిమాతో 2017లో ఎంట్రీ ఇచ్చిన దనీష్ నాయుడు అలియాస్ విశ్వక్ సేన్‌కు ఆ సినమాతో గుర్తింపు దొరకలేదు. ఆతర్వాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామదాస్, హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక హీరో నాని నిర్మించిన హిట్ సినిమా విశ్వక్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సిమిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది.  కొలను శైలేష్ దర్శకత్వంలో వచ్చిన ‘హిట్’ సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. అయితే ఈ  సీక్వెల్ పై ఆసక్తికర పోస్ట్ పెట్టాడు నాని. మొదటి కేసును తెలంగాణ హిట్ ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు పరిష్కరించగా రెండవ కేసు ఏపీకి చెందిందని  నాని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అయితే ఈ సీక్వెల్ లో విశ్వక్ సేన్ నటించడం లేదని తెలుస్తుంది. ఈ సెకండ్ పార్ట్ లో అడవి శేష్ హీరోగా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి..

krack ‘jayamma’ roped in for allu arjun’s next!

Richa Gangopadhyay announces her pregnancy and month of childbirth!