
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక యుద్ధ నేపథ్య చిత్రం ‘ఫౌజీ’పై తాజా అప్డేట్ సినీ ప్రియుల్లో ఉత్కంఠను పెంచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా నుంచి విడుదలైన కొత్త పోస్టర్, ప్రభాస్ రౌద్రరూపాన్ని చూపిస్తూ నెట్టింట వైరల్‌గా మారింది. డిసెంబర్ 3, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రభాస్ అంటేనే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లకు మారుపేరు. ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ చిత్రం కోసం ప్రభాస్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపేందుకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన పోస్టర్లో, రక్తం చిందిస్తూ, చేతిలో తుపాకీతో యుద్ధభూమిలో నిలబడిన ప్రభాస్ రూపం అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తాకేలా చేసింది. యుద్ధం నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించనుంది..!!

