
బాలీవుడ్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో చేసిన కొన్ని సినిమాలు కూడా ఆమెకి నిరాశనే మిగిల్చాయి. భరత్ అనే నేను తో సాలిడ్ వెల్కమ్ అందుకున్న కియారాకి తర్వాత లక్ కలిసి రాలేదు. ఇక మొదటిసారి కన్నడలో తన అదృష్టాన్ని ఆమె పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యింది. అయితే కియారా ఈ గ్యాప్ లో ఓ తమిళ్ ప్లాప్ నుంచి లక్కీగా బయటపడింది..
ఆ సినిమానే ఎల్ ఐ కే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తన భార్య నయనతార నిర్మాణం వహించింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి పాత్రలో మొదట కియారానే తాను సంప్రదించాను. కానీ ఆమె చేయలేదని, ఆమె చెయ్యకపోవడమే ఆమెది మంచిది అయ్యిందని టాక్సిక్ తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను చెప్పడం ఇపుడు వైరల్ గా మారింది. దీనితో తన సినిమాని తానే ట్రోల్ చేసుకుంటూ విగ్నేష్ శివన్ నిజాన్ని ఒప్పుకోవడంతో కోలీవుడ్ ఆడియెన్స్ ఈ కామెంట్స్ ని మరింత వైరల్ చేస్తున్నారు..!!