in

Keerthy Suresh’s uncomfortable flight incident with a drunk passenger!

Vijay on Rashmika’s Marriage Proposal: ‘Ask Me 100 Times’

సినీ తారలపై అభిమానులు చూపించే ప్రేమ ఒక్కోసారి ఇబ్బందికరంగా మారుతోంది. తాజాగా నటి కీర్తి సురేశ్‌కు విమాన ప్రయాణంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు సెల్ఫీ కోసం ఆమెను ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆమె భర్త ఆంటోనీ తట్టిల్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరకు విమాన సిబ్బంది సాయం తీసుకోవాల్సి వచ్చిందని కీర్తి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కీర్తి తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి ఇటలీలోని మిలాన్‌ నుంచి భారత్‌కు విమానంలో వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది..

మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఆమె వద్దకు వచ్చి సెల్ఫీ అడిగాడు. అతడు సరిగా నిలబడలేకపోవడంతో కీర్తి కాసేపు ఆగాలని సూచించింది. అయితే ఆ వ్యక్తి ఆమె మాటలను పట్టించుకోలేదు. వెంటనే ఫొటో దిగాల్సిందేనంటూ పట్టుబట్టాడు. ఆ ప్రయాణికుడి ప్రవర్తనతో కీర్తి అసౌకర్యానికి గురైంది. తన తరఫున నిర్ణయం తీసుకునే హక్కు అతడికి లేదని స్పష్టం చేసింది. సాధారణంగా ఎంతో ప్రశాంతంగా ఉండే తన భర్త ఆంటోనీ సైతం ఈ ఘటనలో గట్టిగా మాట్లాడారని కీర్తి గుర్తుచేసుకుంది. చివరకు పరిస్థితిని చక్కదిద్దేందుకు విమాన సిబ్బంది సాయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది..!!

42 years for KHAIDI