in

Janhvi Kapoor’s Gold Dress Is Costlier Than Actual Gold!

Janhvi Kapoor’s Gold Dress Is Costlier Than Actual Gold!

బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ మరోసారి తన ఫ్యాషన్ సెన్స్‌తో వార్తల్లో నిలిచారు. ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ తొమ్మిదో సీజన్‌లో ఆమె ధరించిన ఒక డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చూడటానికి బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఈ డ్రెస్ ధర, దాని బరువుకు సరిపడా అసలు బంగారం కంటే ఎక్కువ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ప్రముఖ డిజైనర్ మోర్ఫ్యూ అటెలియర్ రూపొందించిన ఈ కస్టమ్ గోల్డ్ మెటల్-మెష్ మినీ డ్రెస్‌లో జాన్వీ ఎంతో అందంగా కనిపించారు. బ్యాక్‌లెస్ హాల్టర్-నెక్ డిజైన్‌తో, మెటాలిక్ ఫినిషింగ్‌తో ఉన్న ఈ డ్రెస్ వెలుగులో మరింతగా ప్రకాశిస్తూ చూపరులను ఆకట్టుకుంది. ఈ డ్రెస్ ధర సుమారు 9,788 డాలర్లు, అంటే భారత కరెన్సీలో రూ. 9 లక్షలకు పైమాటే. ప్రస్తుత బంగారం ధరల ప్రకారం చూస్తే, ఈ మొత్తం దాదాపు 62.52 గ్రాముల 24 క్యారెట్ల బంగారం విలువకు సమానం..!!

Keerthy Suresh’s uncomfortable flight incident with a drunk passenger!

Trisha Krishnan in talks to play Jayalalithaa in MGR’s biopic!